ఆస్ట్రేలియా మంటల్లో ఎన్ని లక్షల జంతువులు కాలిపోయాయో తెలిస్తే…!

-

సంపన్న దేశాల్లో ఒకటిగా ఉన్న ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ఇప్పట్లో అదుపులోకి వచ్చే విధంగా కనపడటం లేదు. సెప్టెంబర్ చివరి వారంలో మొదలైన ఈ మంటలు దేశం మొత్తాన్ని దహించి వేస్తున్నాయి. ఇప్పటి వరకు దేశంలో అగ్ర భాగం మంటల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ మంటలు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎంత మాత్రం కనపడటం లేదు. ఇదిలా ఉంటే ఈ మంటలు ఇప్పుడు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.

వేలాది ఎకరాల్లో పంట, అడవులు అన్ని దగ్దమవుతున్నాయి. వేగంగా విస్తరిస్తున్న మంటల ధాటికి లక్షలాది మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ మంటల ధాటికి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా దాదాపు 24 లక్షల మూగ జీవాలు మరణించాయి. ప్రస్తుతం 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఆ దేశంలో నమోదు అవుతుంది. దానికి తోడు ఎండ కూడా ఎక్కువగానే ఉండటంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అధికారులు.

అడవుల్లో మంటలు విస్తరించడంతో ఆస్ట్రేలియా జాతీయ జంతువు కంగారూలు వేల సంఖ్యలో కాలిపోయాయి. అలాగే సింహాలు, పులులు కూడా భారీగానే ఈ మంటల్లో చనిపోయాయి. ఇప్పటికే మంటలను అదుపు చేయడానికి గాను సైన్యం రంగంలోకి దిగింది. మంటలను అదుపు చేసేందుకు గాను వేలాది అగ్నిమాపక యంత్రాలను అక్కడి ప్రభుత్వం వినియోగిస్తున్నా సరే ఫలితం మాత్రం కనపడటం లేదు. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వేడి గాలులు వీస్తున్నాయి. న్యూ సౌత్‌‌ వేల్స్‌, విక్టోరియా రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news