అదిరిపోయేలా హీరోయిన్​ రోజా కూతురు ఫొటోషూట్​.. సినిమాల్లోకి ఎంట్రీ సిద్ధమైనట్లేనా?

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్​గా కొన్ని సంవత్సరాల పాటు ఒక ఊపు ఊపింది సీనియర్​ నటి రోజా. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర హీరోలందరితో కలిసి ఆమె నటించింది. నటించడమే కాకుండా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నది. ఇలా సినిమాల ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న రోజా ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సేవలందిస్తూ మరింత పాపులారిటీని పెంచుకుంది.

అలాగే బుల్లితెర షోస్ అయినా జబర్దస్త్​లోనూ జడ్జిగా కొన్ని సంవత్సరాలు పని చేసి ఫుల్​ క్రేజ్​ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే మంత్రి పదవి రావడంతో ప్రోటోకాల్ ప్రకారం పూర్తి సమయం ప్రజలతోనే గడపాలి కాబట్టి జబర్దస్త్ షో నుంచి వైదొలిగింది.

అయితే రోజా తమిళ డైరెక్టర్ సెల్వమణిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు.. అయితే ఆమె కూతురు అన్షు మాలిక సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైనట్టు కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో ఆమెను హీరోయిన్​గా ఎంట్రీ ఇవ్వడం కోసం ఇప్పటికే డాన్స్​తో పాటు యాక్టింగ్​లో ట్రైనింగ్ కూడా ఇప్పించినట్లు తెలుస్తోంది.

అన్షు మాలిక ఒక సినీ వారసుడు నటించినున్న చిత్రం ద్వారా హీరోయిన్​గా అరంగేట్రం చేయనుందని సమాచారం. ఈమెతో సినిమాలు చేయడం కోసం దర్శకులు కూడా ఆసక్తి చూపుతున్నారట. మరోవైపు కోలీవుడ్ దర్శకులు సైతం రోజాతో పాటు ఆమె భర్త సెల్వమణిని సంప్రదిస్తున్నారట. ఈ తరుణంలో అన్షు మాలిక తెలుగు సినిమాతో ఎంట్రీ ఇస్తుందా.. తన తండ్రి సెల్వమణికి సంబంధించిన తమిళంలో ఎంట్రీ ఇస్తుందా అనేది తెలియాలంటే కొంత కాలం వేచి ఉంటాల్సిందే.

ఇక పోతే అన్షు.. సోషల్​మీడియా విషయానికొస్తే ఎప్పుడూ చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను పోస్ట్​లను పెడుతుంటుంది. ఆమె ఫొటోషూట్స్​ను కూడా పోస్ట్ చేస్తుంటుంది. అవి అభిమానులను ఆకట్టుకున్నాయి. ఓ సారి వాటిని చూసేద్దాం..