జై పవన్ కళ్యాణ్..జై అష్షు రెడ్డి.. వర్మ సంచలన పోస్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటే ఆయన అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాాంక్షలు చెబుతుంటారు. అయితే పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ ఎప్పుడూ ఎదో ఒక అంశం తో సెటైర్లు వేస్తారన్న సంగతి తెలిసిందే. కాగా ఆర్జీవీ కూడా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అడ్వాన్స్ గా పుట్టిన రోజు శుాకాంక్షలు తెలిపారు. అది కూడా వర్మ తన స్టైల్ లోనే పవన్ కు విషెస్ చెప్పారు. ఆర్జీవీ సోషల్ మీడియాలో అష్షు సీక్రెట్ ప్లేస్ లో వేసుకున్న టాటూ ఫోటో షేర్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున…ఆయనను అభిమానించే అష్షు రెడ్డి తరపున పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే…. అష్షు నాతో చేసిన ఇంటర్వ్యూ ప్రోమో సెప్టెంబర్ 2న సాయంత్రం 6 గంటలకు విడుదల అవుతుంది. జై పవన్ కళ్యాణ్..జై అష్షు రెడ్డి..” అంటూ వర్మ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక వర్మ పోస్ట్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు మండి పడుతున్నారు. మరో వైపు అష్షు రెడ్డి ఈ ఫోటో పై నెటిజన్లు చేస్తున్న కామెంట్ల కు తన స్టైల్ లో సమాధానం ఇస్తుంది.