వడ్డీరేట్లు పెరుగుతున్నాయి.. భారం తగ్గాలంటే ఇలా చేయండి..

-

సెంట్రల్‌ బ్యాంకు ఆర్బీఐ తాజా నిర్ణయంతో సామాన్యుడికి భారీ షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే ప్రక్రియలో ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.40 శాతాని చేరింది. మే నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా మూడో సారి రెపో రేటును పెంచింది. మే నుంచి ఆగస్టు మధ్య కాలంలో రెపో రేటు 140 బేసిస్ పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం పెంచిన రెపో రేట్ల ఫలితంగా గృహ, వాహనాల రుణాలపై  వినియోగదారులకు ఈఎంఐ భారం పడనుంది.

ఆగస్టు 5న ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ సహా ఇతర బ్యాంకులు రుణ రేట్లను పెంచాయి. అయితే కొన్ని నిబంధనలను పాటించడం ద్వారా కస్టమర్లపై పడే వడ్డీ భారాన్నీ తగ్గించుకోవచ్చు.

ఈఎంఐ( EMI) లేదా లోన్ కాలపరిమితిని పెంచాలా..  పెరుగుతున్న వడ్డీ రేట్ల ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే.. ప్రస్తుతం హోమ్‌ లోన్‌ తీసుకొని కస్టమర్లు వారి ఈఎంఐ కాలాన్ని పెంచుకోవడం, లేదా మీ లోన్‌ కాలపరిమితిని పెంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే లోన్‌ టెన్యూర్‌ పెంచుకుంటే మీ ఈఎంఐ పెంపు ఆప్షన్‌ కంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

హోమ్ లోన్ ప్రీపేమెంట్..  వడ్డీ భారాన్ని తగ్గింపు కోసం కస్టమర్లు ముందస్తు చెల్లింపు చేయవచ్చు. అనగా తమ హోమ్‌లోన్‌లను ముందస్తుగా చెల్లించాలి. వడ్డీ వ్యయం తగ్గించుకునేందుకు లోన్‌ కాలపరిమిత తగ్గింపు ఆప్షన్‌ ఎంచుకోవాలి. అంతేకాకుండా రెగ్యులర్‌ ప్రీపేమెంట్ వల్ల బకాయి ఉన్న లోన్ మొత్తం గణనీయంగా తగ్గుతుంది.

అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌..   తక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్న బ్యాంకులకు బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయడం మరో ఆప్షన్‌. అర్హత ఉన్న రుణగ్రహీతలు తమ హోమ్ లోన్‌లను ప్రస్తుతం ఉన్న బ్యాంక్‌ కంటే తక్కువ వడ్డీ రేట్లు అందించే ఇతర బ్యాంకుకు మార్చుకునే వెసలుబాటు ఉంది. అయితే ఈ ప్రక్రియకు అదనపు ఖర్చులు అవుతాయని గుర్తుంచుకోండి. లోన్‌ తీసుకున్న కస్టమర్లు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకునే ముందే వారికి ఎదురయ్యే లాభనష్టాలను చెక్‌ చేసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news