మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ వలన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలా చేయండి!

-

మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ వలన చర్మం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. మొబైల్ ద్వారా వచ్చే లైట్ నుంచి స్కిన్ ఎలా రక్షణ పొందాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది స్మార్ట్‌ఫోన్లకు వెతుక్కుంటున్నారు. స్మార్ట్‌ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వలన అనేక చర్మ సమస్యలు వస్తాయి. ఆ సమస్యలకు దూరంగా ఉండాలంటే మాత్రం కొన్ని టిప్స్‌ని ఫాలో అవ్వాలి. స్కిన్ బాగుండాలంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉండే స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్‌ని ఉపయోగించండి. వాటిలో విటమిన్ C, విటమిన్ E వంటి పదార్థాలు ఉండేలా చూసుకోండి.

చర్మం బాగుండాలంటే తప్పక సన్ స్క్రీన్ రాసుకోవాలి. సన్ స్క్రీన్ వలన UV నుండి రక్షణ కలుగుతుంది, చర్మం కూడా బాగుంటుంది. ప్రొటెక్టర్ మాదిరిగా పనిచేసే స్క్రీన్ గార్డ్ గ్లాస్‌ని ఉపయోగిస్తే కూడా పెద్దగా ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇంకా ఎక్కువసేపు ఫోన్ చూడకండి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకుంటూ చూడండి. బ్లూ లైట్ వల్ల ఇబ్బంది కలగకుండా ఉండాలంటే జింక్ ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్ వంటి పదార్థాలు ఉండే స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్‌ను ఉపయోగించడం మంచిది.

రాత్రిపూట లైట్లు ఆపేసాక ఫోన్ చూడడం వల్ల స్కిన్ డామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి అప్పుడు ఫోన్ వాడకపోవడం ఉత్తమం. రోజు రెండుసార్లు ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవడం, మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బ్లూ లైట్ ఇబ్బంది కూడా తగ్గుతుంది. అదేవిధంగా బ్లూ లైట్ నుంచి రక్షణ పొందడానికి బ్లూ లైట్ ప్రొటెక్షన్ స్ప్రే వాడితే చర్మానికి మరింత రక్షణ లభిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news