ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కి పీఎఫ్ డబ్బులును ఇలా ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోచ్చు..!

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాదారులకు మంచి సేవలని ఇస్తుంది. వీటి వలన ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈజీగా ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కి డబ్బులను ఆన్ లైన్ లో సెండ్ చేసుకోవచ్చు. ఈ కొత్త సర్వీసుని తాజాగా తీసుకొచ్చారు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఈ ఆన్‌లైన్ ఫెసిలిటీతో పీఎఫ్ సబ్‌స్క్రయిబర్లు ఇంట్లో కూర్చునే ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కి డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేయడానికి అవుతుంది. అయితే మరి ఎలా డబ్బులను ట్రాన్స్ఫర్ చేయాలి అనేది చూస్తే..

ముందు మీరు మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్(యూఏఎన్)యాక్టివేట్ చెయ్యాలి. అలానే అకౌంట్ హోల్డర్ బ్యాంకు అకౌంట్, ఆధార్ కార్డు నెంబర్ వంటి వివరాలను ఉండేలా చూసుకోండి. ఇక ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ చెయ్యాలి అనే విషయానికి వస్తే..

దీని కోసం ముందు మీరు యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌కి వెళ్లి, యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
అక్కడ ఆన్‌లైన్ సర్వీసులను క్లిక్ చెయ్యండి.
ఆన్‌లైన్ మెంబర్-వన్ ఈపీఎఫ్ అకౌంట్ (ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్‌కి) వెళ్లాలి.
మీ వ్యక్తిగత సమాచారం, ప్రస్తుత కంపెనీకి చెందిన పీఎఫ్ అకౌంట్‌ను వెరిఫై చేయాలి.
నెక్స్ట్ మీరు Get details మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీ ముందు కంపెనీ పీఎఫ్ అకౌంట్ వివరాలు ఉంటాయి.
ఇప్పుడు మీరు మీ పాత లేదా ప్రస్తుతం కంపెనీని ఎంపిక చేసుకోవాలి. అప్పుడు ఫార్మ్ వెరిఫికేషన్ అవుతుంది.
యూఏఎన్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది.
దానిని సబ్‌మిట్ చెయ్యాలి అంతే.

ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్ రిక్వెస్ట్‌ మీరు ప్రస్తుతం పని చేసే కంపెనీకి వెళ్తుంది. దీని తర్వాత మూడు రోజుల్లో మీ మనీ పాత అకౌంట్ నుంచి ప్రస్తుతం పనిచేస్తోన్న కొత్త అకౌంట్‌కు వెళ్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news