బిగ్ బ్రేకింగ్: వైజాగ్ లో మరో కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం…!

-

విశాఖలో గత రెండేళ్ళ నుంచి కాస్త ఆందోళన కలిగించే విధంగా పరిస్థితి ఉంది. ఎక్కడో ఒక చోట జరుగుతున్న ప్రమాదాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఏదోక ప్రమాదం జరుగుతూనే ఉంది. గత ఏడాది ఎల్జీ పాలీమర్స్ లో జరిగిన ప్రమాదం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత కొన్ని కొన్ని సంస్థలు కూడా అగ్ని ప్రమాదాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.

తాజాగా విశాఖలో మరో ప్రమాదం జరిగింది. హెచ్ పీ సి ఎల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసి పడుతున్నాయి. కంపెనీ పరిసర ప్రాంతాలలో మంటలు భారీగా అలముకున్నాయి. ఘటన సమయంలో కంపెనీ లోపల దాదాపుగా 100 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు అని తెలుస్తుంది. ఇక అక్కడ స్థానికులు భయపడుతున్న నేపధ్యంలో వారిని పోలీసులు వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news