ఒక పౌండ్ కి ”సిలికాన్ వ్యాలీ బ్యాంక్” ని సొంతం చేసుకున్న హెచ్‌ఎస్‌బిసి..!

-

సోమవారం నాడు కుప్పకూలిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు, బ్రిటీష్ శాఖని హెచ్‌ఎస్‌బిసి కొనుగోలు చేసింది. దీన్ని ఒక పౌండ్‌కు హెచ్‌ఎస్‌బిసి కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఈ విషయం గురించి HSBC CEO నోయెల్ క్విన్ మాట్లాడుతూ.. ఇది మంచి ఫలితాన్ని తీసుకు వస్తుంది అని అన్నారు.

అమెరికాలో అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూతపడింది. ఇది అతి పెద్ద సంక్షోభం. బ్యాంక్ లో కస్టమర్లు దాచుకున్న డబ్బులు సుమారు 175 బిలియన్ డాలర్లను అమెరికా డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కట్టాల్సి ఉంది. ఈ బ్యాంకు వలన అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా పడిపోయాయి.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యూఎస్ బాండ్స్ లో పెట్టుబడులు పెట్టింది. యూఎస్ బాండ్ల విలువ దారుణంగా పడిపోయింది. దీనితో నష్టం తప్పలేదు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూత పడిన నేపథ్యంలో కస్టమర్లు ఏమి ఆందోళన చెందాల్సిన పని లేదంది.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ UK లిమిటెడ్ మార్చి 10 నాటికి 5.5 బిలియన్ పౌండ్ల లోన్స్ ని కలిగి ఉందట. అలనే మొత్తం డిపాజిట్లు 6.7 బిలియన్ పౌండ్లు అని HSBC పేర్కొంది. SVB UK యొక్క టాంజిబుల్ ఈక్విటీ 1.4 బిలియన్ పౌండ్ల దాకా వుండచ్చట. ఉన్న నిధులను ఉపయోగించి నిధులు సమకూరుస్తామని బ్యాంకు అంటోంది. లిక్విడిటీ చర్యలను మాత్రం చెప్పలేదు.

Read more RELATED
Recommended to you

Latest news