చైనాలో కరోనా విజృంభణ.. ఆల్‌టైం రికార్డు దాటిన కొత్త కరోనా కేసులు

-

యావత్తు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేసిన కరోనా రక్కసి మరోసారి చైనా తన ప్రభావాన్ని చూపుతోంది. చైనాలో కరోనా కేసులు ఆల్‌టైమ్‌ హైకి చేరుకున్నాయి. మహమ్మారి విజృంభణతో వైరస్‌బారిన పడుతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. గురువారం రికార్డు స్థాయిలో 31 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా, నేడు 32,695 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఇందులో 3041 మందికి కరోనా లక్షణాలు ఉండగా, 29,654 మందికి ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు.

China Covid Cases: China's Beijing Reports Over 300 New Covid Cases,  Enforces Travel Curbs

దీంతో వైరస్‌ విజృంభణను నిలువరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎక్కువ కేసులు నమోదవుతున్న పట్టణాల్లో లాక్‌డౌన్లు విధిస్తున్నారు. తాజాగా రికార్డయిన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా గ్వాంగ్‌జౌ, ఛోంగ్‌క్వింగ్‌ పట్టణాల్లో ఉన్నాయి. ఛెంగ్డూ, జినాన్‌, లాన్‌జౌ, గ్జినా, వుహాన్‌ పట్టణాల్లో కూడా భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయ పట్టణాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ఇండ్ల నుంచి బయటకు రాకూడని అధికారులు ఆదేశాలు జారీచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news