ప్రతి ఒక్కరికి జీవితంలో ముందుకు వెళ్లాలని ఉంటుంది. అందుకోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. పైగా ప్రతి ఒక్కరికి జీవితంలో కొన్ని కలలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి కృషి చేస్తూ ఉంటారు. నిజానికి అనుకున్నది సాధించడం అంత తేలిక కాదు. ప్రతి రోజు ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఎన్నో ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది వీటన్నిటిని దాటితేనే మనం అనుకున్నది సాధించగలం.
కొందరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళని చూసి మనం ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా ముందుకు వెళ్లగలం. ఈమె కూడా మనకి ఎంతో స్ఫూర్తిదాయకం. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే నిజానికి ఎంతో కష్టపడితే కానీ ఐఏఎస్ సాధించడం సులభం కాదు.
చాలా మంది ఎన్నో సార్లు పరీక్ష రాసి ఫెయిల్ అవుతూ ఉంటారు మళ్ళీ మళ్ళీ దాని కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. 19 ఏళ్ల అమ్మాయి సుబ్బలక్ష్మి పరిదా కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని నిర్ణయించుకుంది ఆమె కలని సాధించడం కోసం ఎంతగానో శ్రమిస్తోంది. అయితే ఆమె ఈ కలను నెరవేర్చుకోవడానికి ఒక ఆర్గానిక్ టీ స్టాల్ ని నడుపుతోంది. ఒక పక్క టీ కొట్టు నడుపుకుంటూ మరొక పక్క ఆ డబ్బులతో ఐఏఎస్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతోంది. ఇలా ఈమె టీ కొట్టు నడపడం వలన ఆమె కుటుంబానికి ఆర్థికంగా సమస్యలు రావని ఆమె భావిస్తోంది. నిజంగా ఈమె ఎంతో స్ఫూర్తిదాయకం కదా..? ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా జీవితంలో ముందుకు వెళ్లగలం.