కర్నూలు జిల్లాలోని ఆ ప్రాంతంలో భారీగా బంగారు నిక్షేపాలు…!

-

కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు వెలికితీసేందుకు పరిశోధన పనులు మొదలయ్యాయి. తుగ్గలి మండలం లోని అనేక గ్రామాలలో.. బంగారు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని నాలుగు దశాబ్దాలుగా వివిధ కంపెనీలు, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. పొలాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన కంపెనీలు, డ్రిల్లింగ్ ద్వారా భూగర్భంలో తవ్వకాలు చేసి విస్తృత పరిశోధనలు చేసారు. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, జొన్నగిరి పరిసరాల్లో పనులు చేపట్టింది.

కర్నూలు జిల్లాలో 597.82 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు ఉన్నట్టు జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశోధన తేల్చింది. తుగ్గలి మండలం లోని జొన్నగిరి, పగిడిరాయి బొల్లవాని పల్లె, ఎర్రగుడి,పి.కొత్తూరు,కడమకుంట్ల పరిసర ప్రాంతాలలో బంగారు వెలికితీతకు, సంవత్సరానికి 16 వేలు చొప్పున ఎకరానికి రైతుకు చెల్లించే విధంగా జియో మైసూరు కంపెనీ అగ్రిమెంట్ చేసుకుంది. అయితే ఒప్పందం ప్రకారం మూడేళ్ల నుంచి డబ్బులు చెల్లించలేదు. కొంతకాలంగా పరిశోధనలు నిలిచిపోయాయి. సుదీర్ఘ విరామం తరువాత నిన్నటి నుండి మళ్లీ బంగారు నిక్షేపాల కోసం పరిశోధన పనులు ప్రారంభించిందీ జియో మైసూర్ .

Read more RELATED
Recommended to you

Latest news