కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎల్ ఆర్ ఎస్ ఉచితం !

-

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎల్ ఆర్ ఎస్ ఉచితంగా చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో అమానవీయంగా వ్యవహరిస్తోందన్న ఆయన 12తేదీన ఏఐసీసీ ఇంఛార్జ్ మనిక్కం ఠాగూర్ దుబ్బాక ఎన్నికల పై సమీక్ష చేస్తారని అన్నారు. అలానే 15న మధ్యాహ్నం దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేస్తారని ఆయన ప్రకటించారు.

 

ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఖజానా నింపు కోవడం కోసమే ఎల్ ఆర్ ఎస్ తెచ్చారని అన్నారు. రిజిస్ట్రేషన్ నాటి వాల్యూ ఆధారంగా ఎల్ ఆర్ ఎస్ రుసుము ఉంటుందని సభాముఖంగా మంత్రి చెప్పినా అమలు చేయట్లేదని అన్నారు. ప్రజల ఆస్తుల వివరాలు గ్రామ పంచాయతీ రికార్డ్ లలో నిక్షిప్తమై ఉన్నాయని మళ్ళీ ఎందుకు సర్వే చేస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు. పన్నుల భారం మోపేందుకే మళ్ళీ సర్వే లు చేస్తున్నారన్న ఆయన న్యాయ స్థానంలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తప్పదని అన్నారు. నో ఎల్ ఆర్ ఎస్ ,నో టిఆర్ఎస్..స్లోగన్ ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆయన పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news