ఏడు కొండల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శించుకునేందుక భక్తులు పోటెత్తారు. కరోనా కారణంగా గడిచిన రెండేళ్లు సందడి లేని తిరుమలలో ప్రస్తుతం మునుపటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత 90 రోజులు చూస్తే ఏ రోజు 3కోట్లు తగ్గకుండా ఆ దేవదేవునికి భక్తులు సమర్పించే హుండీ కానుకల ద్వారా ఆదాయం సమకూరుతోంది. వడ్డీ కాసులవాడి హుండీ కళకళలాడుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి అఖిలాండ కోటి బ్రహ్మండనాయకుడైన శ్రీవారి దర్శనార్దం భక్తులు తిరుమలకు విచ్చేస్తుంటారు. దీంతో తిరుమల క్షేత్రం భక్తులతో కళకళ కిక్కిరిపోయింది. గతంలో వారాంతపు రోజులలో, విశేష పర్వదినాలలో మాత్రమే రద్దీ అధికంగా ఉండగా.. ఆ రోజుల్లో మాత్రమే హుండీ ఆదాయం ఎక్కువ వచ్చేది.
అయితే ప్రస్తుతం భక్తుల రద్దీకి సంబంధం లేకుండా హుండీ కానుకలు మాత్రం 3 కోట్లకు పైగా లభిస్తుంది 2020 సంవత్సరం వరకు పెరుగుతూ వచ్చినా ఆదాయం ఆ తర్వాత కరోనా కారణంగా పూర్తిగా తగ్గిపోయింది. 80 రోజులు పాటు దర్శనాలు నిలివేశాకా, తర్వాత కూడా పరిమితంగానే భక్తులను అనుమతించారు. దీంతో 2020 సంవత్సరానికి 1300 కోట్ల రూపాయల వరకు హుండీ ఆదాయం వస్తుందని అనుకుంటే 700 కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. 2021లో కూడా 900 కోట్లు మాత్రమే వచ్చింది. వేసవి సెలవులు కావడంతో భక్తజనంతో తిరుమల రద్దీగా మారింది.