అమ్మాయిలను మత్తెక్కిస్తున్న ‘పెనిస్ ప్లాంట్స్ ‘..ఎక్కడో తెలుసా?

-

కొన్ని దేశాలలో మనుషుల అంగాలను పోల్చిన పండ్లు, కాయలను పండిస్తున్న సంగతి తెలిసిందే..ఆ దేశంలోని జనాలు కూడా వాటికి విపరీతంగా ఆకర్షితులు అవుతూన్నారు.కొన్నిటికి ప్రభుత్వ సహకారం లభిస్తే , మరి కొన్నిటికీ మాత్రం విమర్శలకు దారి తీస్తుంది..కాంబొడియా ప్రభుత్వానికి పెద్ద సమస్య వచ్చింది… ఆ దేశంలోని పెనిస్ ప్లాంట్స్‌ పెంపకానికి ఆటంకం ఏర్పడింది..అచ్చం పురుషాంగాన్ని పోలి ఉండే ఈ మొక్క పుష్పాలను పట్టుకుని సెల్ఫీలు తీసుకునేందుకు పర్యాటకులు ఎగబడుతున్నారు. ముఖ్యంగా ఈ పువ్వులు అమ్మాయిలను ఆకర్షిస్తున్నాయి.

ఈ డిమాండ్‌ మూలంగా అవి అంతరించిపోతున్నాయి. దీంతో ‘నెపెంథెస్ హోల్డెని’గా పిలువబడే ఫాలిక్ ఆకారపు పెనిస్ ఫ్లవర్స్‌తో ఆడుకోవద్దని కాంబోడియా ప్రభుత్వం ఆ దేశ పౌరులను హెచ్చరించారు. కొందరు మహిళలు ఈ పూల మొక్కలను పీకెసిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి.అందుకు సంభంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పర్యావరణ మంత్రిత్వ శాఖ బుధవారం కఠినమైన ప్రకటన విడుదల చేసింది. ‘సహజ వనరులను ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు. కానీ పీకేయడం వల్ల ఈ మొక్కలు అంతరించిపోతాయి. భవిష్యత్‌లో ఇలా చేయొద్దు’ అని ప్రకటనలో పేర్కొంది.

కాగా, ప్రత్యేకమైన పువ్వులు గల ఈ మాంసాహార ఉష్ణమండల కాడ మొక్కలు సముద్ర మట్టానికి 600 మీటర్ల నుంచి 800 మీటర్ల ఎత్తులో పెరుగుతాయి.ఈ పూల ఆకారం కారణంగా వీటిని పెనిస్ ప్లాంట్‌’గా పిలుస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి రక్షిత జాతిగా ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో స్థానికులు, పర్యాటకులు ఈ వృక్షజాలాన్ని నేల నుంచి పీకేసి సోషల్ మీడియాలో పోస్టుల కోసం సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా 129 రకాల కాడ మొక్కలు ఉన్నాయని, వాటిలో ఐదు కంబోడియాలోని పలు ప్రాంతాల్లో పెరుగుతాయని పర్యావరణ శాఖ ప్రతినిధి చెప్పారు. ఈ పూలను చూసెందుకు జనాలు ఎగబడటం విశేషం..

Read more RELATED
Recommended to you

Latest news