తెలంగాన రాజకీయాల్లో హుజురాబాదు ఉప ఎన్నిక ఆసక్తిగా మారింది. ఈటల రాజేందర్ ఖాళీ చేసిన స్థానంలోకి ఎవరు వస్తారనే విషయంలో అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. తెరాసని వీడిన ఈటల్ రాజేందర్ బీజేపీలో చేరడంతో హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ నుండి ఎవరు నిలబడతారనేది అందరిలో ఆసక్తి కలుగుతుంది. ఈ విషయమై టీఆర్ఎస్ కూడా బాగా ఆలోచిస్తుంది. దీనికోసం కొత్త కొత్త సమీకరణాలను ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది.
టీఆర్ఎస్ చూపు ముగ్గురు నేతలపై పడినట్లు తెలుస్తుంది. అందులో ఒకరు కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎల్ రమణ, తాజాగా కాంగ్రెస్ పార్టీని వీడిన కౌశిక్ రెడ్డి, ఇంకా హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన పెద్దిరెడ్డి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరున్నట్లు ప్రచారం జరుగుతుంది. అదలా ఉంటే, ప్రస్తుతం కేసీఆర్, హుజురాబాద్ స్థానిక సంస్థల నాయకులతో చర్చలు జరిపారు. హుజురాబాద్ నియోజక వర్గ రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. అన్ని రకాలుగా ఆలోచించి ఎవరైతే బాగుంటారనేది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. కాకపోతే ఇప్పుడప్పుడే అభ్యర్థిని ప్రకటించే ఉద్దేశ్యం లేదని వినికిడి.