Hunt Movie : సుధీర్‌ బాబు ‘హంట్‌’ టీజర్ రిలీజ్.. దుమ్ములేపిన సుధీర్ బాబు

-

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో సుధీర్ బాబు కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎస్ ఎం ఎస్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన సుధీర్బాబు ఆ తర్వాత క్రమక్రమంగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి విజయాలను కూడా అందుకున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.

తన నటనతోనే కాదు తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు సుధీర్బాబు. ఇక ఇటీవలే నాని సుధీర్ బాబు మల్టీ స్టారర్ గా వి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం హీరో సుధీర్ బాబు చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో హంట్ సినిమా ఒకటి. మహేష్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సుధీర్ కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు సినిమాపై హైప్ ను పెంచేశాయి. అయితే తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ టీజర్ లో సుధీర్ బాబు దుమ్ము లేపేశాడు. ఇందులో యాక్షన్ సీన్స్ కు కూడా ఆకట్టుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news