నిజ‌జీవితంలో మెగుడు… పెళ్లాం… ఫేస్‌బుక్‌లో ల‌వ‌ర్స్ అయ్యారు…!

-

ఇదో ఫేసుబుక్కు కథ. వినటానికి సినిమా కామెడీలా అనిపిస్తుంది. ఈ క‌థలో చాలా ట్విస్టులే ఉన్నాయి. మాన‌వ‌, వైవాహిక సంబంధాల‌పై ఫేస్‌బుక్, సోష‌ల్ మీడియా ఎలాంటి ప్ర‌భావం చూపిస్తుందో ఈ సంఘ‌ట‌న అద్దం ప‌డుతుంది. వీటి వ‌ల్ల వైవాహిక బంధాలు కూడా ఎలా విచ్ఛిన్న‌మ‌వుతున్నాయో చెపుతోంది. అస‌లు విష‌యంలోకి వెళితే పెళ్లియ‌న ఒక వివాహితుడు ఫేస్‌బుక్‌లో త‌న ఫొటో బ‌దులు ఓ సినిమా హీరో ఫొటో పెట్టుకున్నాడు. అత‌డు అంద‌మైన అమ్మాయిల‌తో చాటింగ్ చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే అటు వైపు నుంచి ఓ అమ్మాయితో ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది.

husband and wife facebook lovers
husband and wife facebook lovers

ఆమెకు కొద్ది రోజుల త‌ర్వాత ప్ర‌పోజ్ చేశాడు. అటు నుంచి కూడా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. ఇక వారి మధ్య మూడు షేరింగులు.. ఆరు చాటింగ్ లుగా వ్యవహారం నడిచింది. ఇలా కొద్ది రోజుల పాటు ఈ ప్రేమ వ్య‌వ‌హారం న‌డిచాక వారు ఒక‌రినొక‌రు క‌లుసుకోవాల‌ని… త‌మ కోరిక‌లు తీర్చుకోవాల‌ని అనుకున్నారు. ఓ రోజు పార్క్‌లో క‌లుసుకునేందుకు డిసైడ్ అయ్యారు. క‌లుసుకునే లొకేష‌న్ కూడా షేర్ చేసుకున్నారు.

ఇద్ద‌రూ ఎవ‌రికి వారు చ‌క్క‌గా ముస్తాబు అయ్యి పార్క్‌కు వ‌చ్చారు. చివ‌ర‌కు వారు ఒక‌రినొక‌రు చూసుకుని కేక‌లు వేసుకోవ‌డంతో ఒక‌రినొక‌రు పిచ్చ తిట్లు తిట్టుకున్నారు. చివ‌ర‌కు ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ఇదంతా చూసిన పబ్లిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. చివ‌ర‌కు పోలీసులు వ‌చ్చి వారిని విడ‌దీశారు. ఆ త‌ర్వాత వీళ్లు చెప్పిన విష‌యం విని అక్క‌డున్న వారికి మైండ్‌బ్లాక్ అయ్యింది.

ఆ ఫేస్‌బుక్ ల‌వ‌ర్స్ ఇద్ద‌రూ నిజ‌జీవితంలో భార్య‌భ‌ర్త‌లు. ఇద్దరూ వేరే వాళ్ళ ఫొటోలతో ఫేసు బుక్ లో కలుసుకుని.. ప్రేమించేసుకున్నారు. ఇలా వీళ్లు ప‌క్క ప‌క్క‌నే ఉంటూ ఒక‌రితో మ‌రొక‌రు చాట్ చేస్తూ ఒక‌రినొక‌రు మోసం చేసుకున్నారు. తీరా వాళ్లు మెఖాలు చూసుకున్నాక తెల్ల‌బోయారు. చివ‌ర‌కు పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ఏదేమైనా సోష‌ల్ మీడియా మాన‌వ బంధాల‌ను ఎలా విచ్ఛిన్నం చేస్తుందో ఈ సంఘ‌ట‌నే పెద్ద ఉదాహ‌ర‌ణ‌.

Read more RELATED
Recommended to you

Latest news