మంచం పై భార్య.. ఉరికొయ్యకు భర్త.. అసలేం జరిగిందంటే..!

ఈ మధ్య కాలంలో అసలు మానవ బంధాలకు విలువ లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే. చిన్నచిన్న కారణాలకే ఏకంగా స్వంత వారిని దారుణంగా హత్య చేసిన ఘటనలు ఎన్నో తన మీదకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. భార్యను దారుణంగా చంపేసిన భర్త అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని వెలుగులోకి వచ్చింది. పాల్కర్ జిల్లా వసాయ్ ప్రాంతానికి చెందిన జ్యోతి చవాన్ రాహుల్ చవాన్ భార్య భర్తలు. రాహుల్ చావాన్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్నాడు అయితే ఇటీవలే గత కొన్ని రోజుల నుంచి ఆ ఇంట్లో రాత్రి పూట కూడా లైట్ వెలగలేదు. దీంతో స్థానికులు గమనించి అనుమానపడ్డారు.

dead body

ఓ రోజు ఇంటికి వెళ్లి తలుపులు కొట్టినప్పటికీ ఎవరు తీయలేదు. దీంతో మరి కొంతమంది స్థానికులు తలుపులు పగలగొట్టి చూడగా ఏకంగా మంచంపై భార్య విగతజీవిగా పడి ఉండగా అదే ఇంట్లో హాల్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని భర్త విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. దాంతో షాకయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా… సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పలు కోణాలలో విచారణ జరుపుతున్నారు పోలీసులు.