కరోనా వల్ల ప్రపంచమంతా అతలాకుతలమైంది. ఎంతో మంది తమ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. చాలా వరకు వ్యాపార సంస్థలు మూతపడ్డాయని ప్రతిఒక్కరికి తెలిసిన విషయమే. లాక్‌డౌన్‌లో ఉద్యోగం కోల్పోయిన వారు కూరగాయల వ్యాపారాలు చేస్తూ, టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందారు. కానీ ఓ వ్యక్తి చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి కమర్షియల్ సెక్స్‌వర్కర్‌గా అవతారమెత్తాడు. దీంతో అతడి భార్య విడాకులు ఇప్పించమని కోర్టును ఆశ్రయించింది.
ఈమె భర్త (27 ఏళ్లు) బెంగళూరులోని బీపీఓ కార్యాలయంలో ఉద్యోగం చేసేవాడు. వారిద్దరూ 2017లో కలుసుకున్నారు. రెండేళ్ల తర్వాత (2019లో) వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ సుబ్రమణియన్ నగర్, బెంగళూరులో ఇంటిని అద్దె తీసుకుని నివాసముంటున్నారు. అయితే అప్పుడు కరోనా వ్యాప్తి మొదలైంది. దీంతో ఆ వ్యక్తి తన బీపీఓ ఉద్యోగం కోల్పోయాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించాడు. అలా భార్యకు తెలియకుండా సెక్స్‌వర్కర్‌గా మారిపోయాడు.
కొన్ని నెలలు గడిచిన తర్వాత.. తన భర్త తన దగ్గర ఏదో విషయం దాచిపెడుతున్నాడనే అనుమానం భార్యలో కలిగింది. ఎప్పుడు అతడు.. తన ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లలో గంటల తరబడి గడిపేవాడు. ఉదయం బయటికి వెళ్లి.. ఇంటికి వచ్చే సమయానికి బలహీనమయ్యేవాడు. అసలు విషయం ఏమిటని.. ఎలాగైన రహస్యాన్ని తెలుసుకోవాలని భార్య ప్రయత్నించింది. గతేడాది నవంబర్‌లో ఆ మహిళ తన సోదరుడి సాయంతో భర్త ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ హ్యాక్ చేయించింది. ల్యాప్‌టాప్‌లో ఒక రహస్య ఫోల్డర్‌ను కనుగొంది. ఫోల్డర్‌లో ఆమె భర్త నగ్న వీడియోలు ఉన్నాయి. అప్పుడు ఆమెకు తెలిసింది తన భర్త మేల్ ప్రాస్టిట్యూట్ అని. తన కస్టమర్ల నుంచి గంటకు రూ.3 వేలు నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసేవాడని తెలుసుకుంది.
ఈ మేరకు ఇంటికి వచ్చిన భర్తను నిలదీసింది. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు పెరిగాయి. సమస్యలను పరిష్కరించమని బెంగళూరు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు అనేక సార్లు కౌన్సిలింగ్ ఇప్పించారు. అయినా వారి నిర్ణయంలో మార్పు రాలేదు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారిద్దరూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.