గాంధీలో కరోనా జీనోమ్ సీక్వెన్సింగ్ …!

కరోనా మహమ్మారి కొత్త కొత్త వేరియంట్ ల రూపంలో ఎంట్రీ ఇస్తూనే ఉంది. ఒక్కో వేరియంట్ ఒక్కో రకమైన లక్షణాలను చూపిస్తుంది. కాబట్టి వేరియంట్ కు తగినట్టుగా చికిత్స అందించాల్సి ఉంటుంది. అయితే వేరియంట్ టెస్టింగ్ కోసం ప్రతిసారీ తెలంగాణా నుండి పూణే పంపడం అక్కడ నుండి రిపోర్టులు రావడం కష్టంగా మారింది. మరోవైపు ఒమిక్రాన్ టెర్రర్ మొదలయ్యేలా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేస్తోంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా జీనోమ్ టెస్టింగ్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దాంతో ఇప్పటి నుండి కరోనా పాజిటివ్ వచ్చిన వారి నుండి నమూనాలు సేకరించి ఏ వేరియంట్ బారిన పడ్డారో చెప్పేస్తారు. ఇదివరకు రిపోర్టులు రావడానికి రెండు నుంచి మూడు రోజుల వరకు సమయం పట్టేది ఇకపై టెస్ట్ చేసిన మరుసటి రోజే రిపోర్ట్ లు కూడా రానున్నాయి. దాంతో వెంటనే చికిత్స కూడా ప్రారంభించే అవకాశం ఉంది.