నవంబర్ 15 న తెలంగాణ విజయ గర్జన : కేటీఆర్

టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ మరియు టిఆర్ఎస్ ప్లీనరీ తేదీలను ఇవాళ ప్రకటించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అక్టోబర్ 17 న తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశం ఉంటుందని.. అక్టోబర్ 17 న టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అవుతుందని పేర్కొన్నారు.

ktr

అక్టోబర్ 25 న జనరల్ బాడీ మీటింగ్… ఆ తర్వాత పార్టీ ప్లీనరీ సమావేశం ఉంటుందని.. విజయ గర్జనను విజయవంతం చేసేందుకు అక్టోబర్ 27 నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు ఉంటాయని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. అక్టోబ‌ర్ 25న టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడి ఎన్నిక ఉంటుందని వెల్లడించారు మంత్రి కేటీఆర్.  నవంబర్ 15 న వరంగల్ లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన తెలంగాణ విజయ గర్జన నిరహిస్తామని ప్రకటించారు. లక్షలాదిగా మా పార్టీ సభ్యులు తరలివస్తారు …కదలి రావాలని పిలుపు ఇస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్.