హుజూరాబాద్ ఎన్నికల సంగ్రామం మొదలైంది. నోటిఫికేషన్ విడుదలవ్వడంతో నామినేషన్ల మీద అన్ని పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు ద్రుష్టి సారించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఎన్ని నామినేషన్లు వస్తాయో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ వంటి పార్టీ నుంచే కాకుండా ఇతర పార్టీల నుంచి ఎవరెవరు నామినేషన్లు వేస్తారో అని తెలంగాణ ప్రజలు ఆసక్తితో చూస్తున్నారు. వీరితో పాటు నిరుద్యోగుల నుంచి కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే నామినేషన్ వెలువడిన తొలిరోజే మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో రెండు నామినేషన్లు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ టీఆర్ఎస్ తరుపున నామినేషన్ దాఖలు చేశారు. మరోక నామినేషన్ అన్నా వైెెఎస్ఆర్ పార్టీ నుంచి మహ్మద్ మన్సూర్ అలీ నామినేషన్ దాఖలు చేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ మొదటి సెట్ నామినేషన్ ఇనుగాల పెద్దిరెడ్డి బలపరచగా, రెండో సెట్ నామినేషన్ ను కనుమల్ల విజయ బలపరిచారు.
హుజూరాబాద్ బైపోల్… తొలి రోజు మూడు నామినేషన్లు
-