బాబు…కల్యాణ్ బాబుతో వద్దు…ఆ రచ్చ మనం తట్టుకోలేం…

-

ఏపీలో జగన్‌ని ఎదుర్కోవడానికి చంద్రబాబు బలం సరిపోవడం లేదు. గత రెండున్నర ఏళ్లుగా గట్టిగానే ట్రై చేస్తున్నారు గానీ….పాపం బాబు ఏ మాత్రం జగన్ బలం తగ్గించలేకపోతున్నారు. పోనీ బాబుకు ఆ సత్తా లేదు అంటే….పవన్ కల్యాణ్‌కైనా ఆ సత్తా ఉందా? అంటే అసలు లేదనే చెప్పాలి. ఇప్పుడున్న పరిస్తితుల్లో పవన్ కల్యాణ్ కూడా జగన్‌ని కదపలేరు. అందుకే ఈ మధ్య బాబు-పవన్‌లు కలిసి మరీ జగన్‌కు చెక్ పెట్టడానికి రెడీ అవుతున్నారని కథనాలు వస్తున్నాయి.

tdp-janasena
tdp-janasena

ఇటీవల ఎంపీపీ ఎన్నికల్లో కొన్ని మండలాల్లో టి‌డి‌పి-జనసేనలు జట్టు కట్టి మరీ వైసీపీకి చెక్ పెట్టాయి. దీంతో టి‌డి‌పి-జనసేనల స్నేహబంధం మొదలైందని చర్చ వస్తుంది. పైగా పవన్ సైతం ఈ మధ్య జగన్ ప్రభుత్వంపై ఫుల్ ఎటాక్ మొదలుపెట్టారు. కానీ బాబుని మాత్రం ఒక్క మాట అనడం లేదు. అటు టి‌డి‌పి నేతలు కూడా పవన్‌కు మద్ధతుగా మాట్లాడుతున్నారు. దీంతో బాబు-పవన్‌ల జోడీ కలిసి జగన్‌ని ఎదురుకోవడానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది.

అయితే ఇక్కడే కొన్ని విభేదాలు కూడా వస్తున్నాయి. టి‌డి‌పిలో కొందరు పవన్‌తో పొత్తు పెట్టుకోవాలని డైరక్ట్‌గానే చెబుతున్నారు…కానీ మరికొందరు మాత్రం బాబోయ్ పవన్‌తో పొత్తు వద్దు అని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే 2014లో సపోర్ట్ ఇచ్చి పవన్ ఎంత రచ్చ చేశారో గుర్తు చేసుకోవాలని అంటున్నారు.

అసలు టి‌డి‌పి అధికారంలోకి రావడానికి తామే కారణమని పవన్ గానీ, జనసేన కార్యకర్తలు గానీ హడావిడి చేసేశారు. అసలు ‘మేము లేకపోతే టి‌డి‌పి లేదు’ అన్నట్లుగా మాట్లాడారు. అలాగే తర్వాత టి‌డి‌పిపై ఎలాంటి విమర్శలు చేశారో కూడా తెలుసు. అలాంటప్పుడు మళ్ళీ పవన్‌తో కలిసి….మాటలు అనిపించుకోవడం అవసరమా? అని కొందరు తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు.

అయిందేదో అయింది…ఒంటరిగానే జగన్‌ని ఢీకొడదామని మాట్లాడుతున్నారు. పైగా జనసేనతో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లు లాస్ అవ్వాలి…అసలు 175 నియోజకవర్గాల్లో టి‌డి‌పికి నాయకులు ఉన్నారు. అలాంటప్పుడు కొన్ని సీట్లు జనసేనకి ఇచ్చి…ఆయా నియోజకవర్గాల్లో టి‌డి‌పి మనుగడని ప్రశ్నార్ధకం చేసుకోవడం అవసరమా అని తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు. అసలు పవన్ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదని…కాబట్టి వారితో మనకు రచ్చ వద్దని తమ్ముళ్ళు డైరక్ట్‌గానే బాబుకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news