హుజురాబాద్ సీఎం కేసీఆర్ బహిరంగ సభ !

-

హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రాక ముందే…అక్కడి రాజకీయాలు వెడేక్కాయి. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల వేటపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. హుజూరాబాద్‌లో బలమైన నేతగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే అనుకున్నారు. కానీ అనూహ్యంగా సీఎం కేసీఆర్… కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

అటు బీజేపీ పార్టీ తరఫున ఈటల రాజేందర్‌ లేదా ఈటల జమున పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అటు కాంగ్రెస్‌ కూడా తమ అభ్యర్థి కోసం అన్ని కసరత్తులు చేస్తోంది. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెక్‌ పెట్టేందుకు… దళిత సామాజిక వర్గం నుంచి… అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఎలాగైనా హుజురాబాద్‌ నియోజక వర్గంలో గులాబీ జెండా ఎగుర వేసేందుకు సీఎం కేసీఆర్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న హుజురాబాద్‌ నియోజక వర్గంలో పర్యటించనున్నారు కేసీఆర్‌. అటు కేసీఆర్‌ పర్యటన ఉన్న నేపథ్యంలో.. మంత్రులు గంగుల మరియు కొప్పుల ఈశ్వర్‌ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news