హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాములో ఈవీఎంలను లెక్కించనున్నారు. తొలుత పోస్టల్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్లను లెక్కించనుండగా, ఇందుకోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.
పది గంటలకు గెలుపుపై ఓ అంచనా రానుండగా, మధ్యాహ్నం 2 గంటలకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఓట్ల లెక్కింపునకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు పూర్తి ఏర్పాట్లు చేశారు. అలాగే హుజూర్‌నగర్ గెలుపుపై టీఆర్ఎస్, కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు టీడీపీ, బీజేపీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఇక ఈ రోజు ఎవరి అదృష్టం ఎలా ఉందో తెలిసిపోనుంది.