కోవిడ్ టీకా అని మత్తు మందు.. బంగారం దోచేసిన నర్స్ !

Join Our Community
follow manalokam on social media

హైదరాబాద్‌లో టీకా పేరుతో వృద్ధ దంపతులకు టోపి పెట్టింది ఓ ప్రైవేటు నర్సు. కరోనా టీకా అంటూ వృద్ధ దంపతులకు మత్తు మందు ఇచ్చి ఒంటి పై నగలు అపహరించింది. మొదటి సారి పాయసంలో మత్తు మందు కలిపి ఇచ్చినప్పటికీ వృద్ధ దంపతులకు షుగర్‌ ఉండటంతో పాయసం తాగకుండా పడేశారు. రెండోసారి కరోనా టీకా పేరుతో స్కెచ్‌ వేసిన ఆమె కరోనా వ్యాక్సిన్‌ అంటూ మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చింది. దీంతో దంపతులు స్పృహ కోల్పోయాక నగలను ఎత్తుకెళ్లింది.

 

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు అనుషను అరెస్ట్‌ చేశారు మీర్‌పేట్‌ పోలీసులు. ఇక విచారణలో పలు ఆసక్తికర విషయాలు చెప్పింది అనూష. గతంలో పాయసంలో మత్తుమందు కలిపి ఇచ్చినట్టు తెలిపింది. అయితే, షుగర్‌ ఉండడం వల్ల వృద్ధ దంపతులు పాయసం తినకుండా పారబోశారని రెండో సారి కరోనా వ్యాక్సీన్‌ పేరుతో మోసం చేసినట్టు అంగీకరించింది ఆమె. అయితే, ఈ సారి పథకం పారినా… వృద్ధ దంపతులు వెంటనే అప్రమత్తం కావడంతో పోలీసులు ఈమె ఆటకట్టించారు.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....