ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో.. హైదరాబాద్ నగర రూపురేఖలు ఎలా మారాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఓ వైపు అభివృద్ధి పరుగులు పెట్టడం, మరో వైపు పెట్టుబడులు తరలిరావడంతో హైదరాబాద్ నగరం జెట్ ప్లేన్ లాగా ముందుకెళ్తుంది. అంతే కాదు.. నగరాన్ని బెస్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అటు ప్రజా రవాణాకు, ఇటు పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాముఖ్యత చూపుతున్నారు.
ఇందులో భాగంగా నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీ గా మార్చేందుకు మెట్రో రైలు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, లింకు రోడ్లు వచ్చాయి. మరో వైపు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, నగరాన్ని పరిశుభ్రంగా పెడ్తుహున్నారు. ఈ నేపధ్యం లో హైదరాబాద్ నగరంలో గత తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిపై తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ రీల్స్ కాంటెస్ట్ పోటీలను జరపనుంది. ఈ పోటీలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా రూ. లక్ష నగదు ఇవ్వనున్నట్లు తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ తెలిపింది. హైదరాబాద్ అభివృద్ధిపై యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్లో తమ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసే అవకాశం ఇచ్చింది.
ఈ నాలుగు వేదికల్లో.. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి, నగర ప్రాముఖ్యత గురించి ఆసక్తికరంగా.. 60 సెకన్ల నిడివితో ఓ వీడియో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్ట్‌ను @DigitalMediaTS కు ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. తమ వీడియోలను dir_dm@telangana.gov.in కు మెయిల్ కూడా చేయొచ్చు. వీడియోస్‌ను పోస్టు చేసేందుకు ఏప్రిల్ 30 చివరి తేదీ. ఈ కాంటెంస్ట్‌కు సంబంధించి ఇతర వివరాల కోసం.. https://it.telangana.gov.in/contest/ ను సంప్రదించొచ్చు.