గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు ఎంత ఆసక్తికరంగా సాగాయో చెప్పాల్సిన పనిలేదు. మూడు పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో ఫలితాల్లో చాలా మార్పులు కనిపించాయి. అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి బీజేపీ కి మధ్య ఉత్కంఠభరితమైన పోటీ నిలిచింది. ఐతే ఎప్పుడూ లేని విధంగా బీజేపీ 48సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో కవిత మాట్లాడుతూ, అంచనాలకి తగినట్లుగా సీట్లు గెలుచుకోలేకపోయిన మాట వాస్తవమే. కానీ చాలా చోట్ల చాలా తక్కువ ఓట్ల తేడాతో తెరాస వెనకపడింది.
బీజేపీ వ్యూహాలని మేము అర్థం చేసుకున్నాం. దేశంలో అతిపెద్ద పార్టీగా నిలుద్దామని బీజేపీ ఆశిస్తుంది. కానీ హైదరాబాద్ ప్రజలు బీజేపీకి ఆ అవకాశం ఇవ్వలేదు. బీజేపీని ఎలా కట్టడి చేయాలో హైదరాబాద్ చూపించిందని తెలిపింది. మేము బలహీనంగా లేము. అరవై లక్షల మంది కార్యకర్తలతో మా పార్టీ బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో వేగంగా పుంజుకుంటాం. 2023లో మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే అని మాట్లాదింది.