హైదరాబాద్ మెట్రో సిబ్బంది ధర్నా రెండో రోజు కొనసాగుతోంది. ఇవాళ కూడా మెట్రో టికెటింగ్ సిబ్బంది విధులకు హాజరుకాలేదు. తమ వేతనాలు పెంచాలంటూ నిన్నటి నుంచి మెట్రో రైల్ టికెటింగ్ సిబ్బంది నిరసన కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో కార్యాకలాపాలు యథావిథిగా సాగుతున్నాయి. సాధారణంగా ప్రయాణికుల రాకపోకలు, టికెట్ల జారీ యథాతథంగా జరుగుతున్నాయి.
మంగళవారం రోజున సిబ్బంది మెరుపు ఆందోళనతో మెట్రో కియోలిస్ సబ్ ఏజెన్సీ నిర్వాహకులు వారితో.. అమీర్‌పేట్ మెట్రోస్టేషన్‌లో చర్చలు జరిపారు. దాంతో ధర్నా విరమిస్తున్నట్లు ప్రకటించిన ఉద్యోగులు.. నిర్వాహకులు వేతనాల పెంపుపై ఉన్నతాధికారులతో చర్చించి చెబుతామనన్నారని తెలిపారు. స్పష్టమైన హామీ వచ్చేవరకు.. విధులకు మాత్రం హాజరుకామని టికెటింగ్ సిబ్బంది స్పష్టం చేశారు.