‘’శ్రీదేవి-చిరంజీవి’ సాంగ్​’ షూట్‌ నాకసలు నచ్చలేదు.. శ్రుతిహాసన్ కామెంట్స్

-

‘శ్రీదేవి – చిరంజీవి’ పాట షూట్‌ను తాను ఏ మాత్రం ఎంజాయ్‌ చేయలేదని హీరోయిన్​ శ్రుతిహాసన్‌ చెప్పింది. మంచులో చీర కట్టుకుని డ్యాన్స్ చేయడం చాలా అన్​కమ్​ఫర్టబుల్​గా అనిపించిందని తెలిపింది. ‘ఈ పాట నాకెంతో నచ్చినా, చిత్రీకరణను పూర్తిగా ఆస్వాదించలేకపోయాను. నిజాయతీగా చెప్పాలంటే మరోసారి ఇలా చీర ధరించి మంచులో ఉండే పాట చేయకూడదని భావిస్తున్నా. ఎందుకంటే, ఇది కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. నాకు తెలిసినంత వరకూ ప్రేక్షకులు ఇలాంటివి చూడటానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఈ తరహాలో షూట్‌ చేయాల్సి వస్తోంది. అంతేకానీ, ఒక మహిళకు ఇలాంటివి అసౌకర్యంగా ఉంటాయి’’ అని ఆమె చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

తాను కథానాయికగా నటించిన రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లూ ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా విడుదల కావడంపై స్పందిస్తూ.. ‘‘ఇద్దరు అగ్రహీరోల సినిమాల్లో నటించడం.. అవి రెండూ ఒకేసారి విడుదల కావడం.. ఎంతో ఆనందంగా ఉంది. అవి రెండూ ఒకేసారి విడుదలవుతున్నందుకు ఏమాత్రం భయం లేదు. సెట్‌లో ఉన్నంతసేపు ఎంతో కష్టపడి మా వంతు శ్రమించాం. మంచి ఫలితాలే వస్తాయని భావిస్తున్నాం’’ అని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news