హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ అన్నీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారి
అనురాగ్ జయంతి మీడియా సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా రేపు జరగబోయే హైదరబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్దం చేసినట్లు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ కోసం అని ఏర్పాట్లు పూర్తి చెయ్యడం జరిగిందని, దాదాపుగా 500 మంది ఎలక్షన్ డ్యూటీ లో పాల్గొంటారని తెలిపారు.
ఈ ఎన్నికల కోసం రెండు పోలింగ్ కేంద్రాలు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఏర్పాటు చేశామని, ఇందుకోసం ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి ట్రైనింగ్ కూడా పూర్తి చేశామని చెప్పారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ప్రిఫరేషియల్ పద్దతి ప్రకారం ఓటింగ్.. ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. అంతేగాక ఈ ఎన్నికల కోసం 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.