గోవా వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ ఎన్నో రకాల టూర్ ప్యాకేజీలని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీలతో మంచిగా నచ్చిన టూర్ వేసి వచ్చేయచ్చు. గోవాలోని పలు ప్రాంతాలను చూసేందుకు ఓ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ తీసుకు వచ్చింది. ఇక ప్యాకేజీ వివరాలు చూస్తే.. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. గోవా రిట్రీట్ పేరు తో ఈ ప్యాకేజీ ని తీసుకు వచ్చారు. మరిన్ని వివరాలు చూస్తే.. అక్టోబర్ 12, 2023వ తేదీన అందుబాటులో ఉంది. మొత్తం ఇది 4 రోజులు, 3 రాత్రుల ప్యాకేజీ.
మొదటి రోజు మధ్యాహ్నం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి విమానం స్టార్ట్ అవుతుంది. 2 గంటలకు గోవా ఎయిర్ పోర్టుకు రీచ్ అవుతారు. హోటల్ కి వెళ్లి నైట్ అక్కడే స్టే చేయాలి. రెండో రోజు బ్రేక్ ఫాస్ తర్వాత సౌత్ గోవాకు వెళ్ళాలి. ఓల్డ్ గోవా చర్చ ని అలానే వాక్స్ వరల్డ్ మ్యూజియం, శ్రీ మంగేశ్ టెంపుల్, మీర్మర్ బీచ్ వంటివి చూడవచ్చు. అలానే బోట్ క్రూజర్ లో జర్నీ చేస్తారు. రాత్రి సౌత్ గోవాలోనే ఉండాలి.
ఇక మూడో రోజు అయితే నార్త్ గోవా చూడవచ్చు. ఇక్కడ మీరు కండోలియం బీచ్, బాగా బీచ్ చూడవచ్చు. చపోరా ఫోర్ట్ కి కూడా వెళ్ళవచ్చు. తర్వాత హోటల్ కు వస్తారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు. బ్రేక్ ఫాస్ట్ అయ్యాక హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. 02.30 గంటలకు గోవా ఎయిర్ పోర్టు లో స్టార్ట్ అయితే మధ్యాహ్నం 03.55 గంటలకు హైదరాబాద్ వచ్చేయచ్చు. ధర విషయానికి వస్తే.. సింగిల్ షేరింగ్ కు రూ. 27,560, డబుల్ షేరింగ్ రూ. 21930గా వుంది.. ట్రిపుల్ షేరింగ్ చూస్తే రూ.21805గా ఉంది.