హైదరాబాద్: మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. మద్యం మత్తులో పట్టుబడ్డిన వారి లైసెన్సులు రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన 353 మంది ఒక రోజు నుంచి 20 రోజులు జైలు శిక్ష అనుభవించారు. దీంతో వారి లైసెన్సులు రద్దు చేయాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెన్షన్ చేయాలని ఆర్టీఏ అధికారులు లేఖ రాశారు.
నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై దృష్ట్యా పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రోడ్డు నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అర్ధరాత్రి సమయంలో ర్యాష్ డ్రైవింగ్ పాల్పడుతున్న వారిని గుర్తించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు నిబంధనలు పాటించపోతే ఏఏ చర్యలుంటాయో వివరిస్తున్నారు. అతివేగంగా వాహనాలు నడపొద్దని చెబుతున్నారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను వివరిస్తున్నారు.