హైడ్రా చర్యలు.. భయాందోళనలో నిరుపేద ప్రజలు

-

తెలంగాణలో హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. చెరువులు, కుంటలు,ఎప్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు నిర్దాక్షిణంగా కూల్చివేస్తున్నారు. పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గబోమని హైడ్రా కమిషనర్ రంగానాథ్ ఇప్పటికే తేల్చిచెప్పారు. నోటీసులు ఇచ్చినా ఇవ్వకుండా కూల్చివేస్తామని ప్రకటించారు. ఎవరైనా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన కట్టడాలను స్వయంగా వారే కూల్చివేస్తే బెటర్ అని లేదంటే హైడ్రా కూల్చివేస్తుందని కమిషనర్ స్పష్టంచేశారు.

ఇదిలాఉండగా, నగరంలోని కొన్ని ప్రభుత్వ భూములు, చెరువు ప్రాంతాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా ఇప్పటికే కూల్చివేస్తుండగా, నిరుపేదలు అక్రమంగా వేసుకున్న ఇళ్లను కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో గూడు లేని వారంతా భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు తమ ఇళ్లను కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తారో ఏమో అని బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ఇటీవల కొందరు ప్రజలు ఒంటిమీద కిరోసిన్ పోసుకుని హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిషనర్ కీలక ప్రకటన చేశారు.అల్రెడీ పూర్తయి నివాసముంటున్న కట్టడాల జోలికి వెళ్లబోమని, నిర్మాణంలో ఉన్న అక్రమనిర్మాణాలను కూల్చివేస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news