తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతమంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. అలా సక్సెస్ అయిన వారిలో హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఒకరు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి.. స్టార్ హీరోల సరసన నటించింది. ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కూడా కొనసాగింది రమ్యకృష్ణ..ఇప్పుడు పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తోంది. ఇటీవల లైగర్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన రమ్యకృష్ణ ఈ సినిమాలో మాస్ గెటప్ తో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.అయితే హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో రమ్యకృష్ణకు కూడా బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వెల్లుపడ్డాయట కానీ బాలీవుడ్లో అంతగా సక్సెస్ కాలేకపోయానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. రమ్యకృష్ణ మాట్లాడుతూ హిందీ సినిమాల పైన పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేసింది. బాలీవుడ్ లో వరుస ఆఫర్లు వచ్చాయి కానీ నేను చేసిన సినిమాలు అక్కడ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.. అలాగే నేను అప్పటికే తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నాను.. కాబట్టి ఆ పరిశ్రమను వదిలిపెట్టి బాలీవుడ్ వైపు వెళ్లి అక్కడ సినిమాల సక్సెస్ కోసం పోరాటం చేసేందుకు తనకు ధైర్యం రాలేదని తెలియజేసింది.ఇక అంతే కాకుండా అప్పట్లో అన్నిటిని వదులుకొనే ధైర్యం లేదని కూడా తెలియజేసింది. బాలీవుడ్ లో దయావన్, పరంపర, బనారసి బాబు, చాహత్, తదితర సినిమాలలో నటించింది రమ్యకృష్ణ కానీ ఈ సినిమాలు ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఏదైనా సినీ పరిశ్రమలో ఎక్కువ సినిమాలు చేయాలి అంటే కచ్చితంగా సరైన సక్సెస్ కావాలి కానీ బాలీవుడ్లో అలాంటి సక్సెస్ సినిమా తనకి రాలేదని తెలియజేసింది. ఇక అదే సమయంలో తెలుగులో సినిమాలు చేయడం తనకు సౌకర్యంగా అనిపించిందని ఇక దాంతో తెలుగులోనే సినిమాలు చేయడం మొదలు పెట్టాను దాంతో ఇక్కడే సెటిల్ అయిపోయాను అని తెలియజేసింది రమ్యకృష్ణ. ఏ ఒక్క సినిమా కూడా బాలీవుడ్ లో సక్సెస్ అయ్యి ఉంటే అవకాశాలు వచ్చేవేమోని చెప్పింది రమ్యకృష్ణ.