ఫోన్ ట్యాపింగ్ కేసు స్టేట్ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల నేతల నడుమ మాటల యుద్ధానికి దారి తీస్తోంది.ఈ క్రమంలోనే తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు అనవసరంగా తీస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖపై మాజీ మంత్రి కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మంత్రి కొండా సురేఖకు, మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో కేటీఆర్ లీగల్ నోటీసులపై తాను స్పందించబోనని మంత్రి కొండా సురేఖ తెలిపారు.గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను కేటీఆర్‌పై ఆరోపణలు మాత్రమే చేశానని..ఎలాంటి క్షమాపణలు చెప్పలేదని అన్నారు.కేటీఆరే తాట తీస్తా అని మాట్లాడుతున్నారని అన్నారు. నోటీసులపై నేను లీగల్‌గా వెళ్తానని కొండా సురేఖ ప్రకటించారు.