అమరావతి: పాలనలో సీఎం జగన్ దూకుడు పెంచారు. ప్రజలకు సంక్షేమ పథకాలు మరింత చేరువచేసేందుకు ఎప్పటికప్పుడు కొత్తగా పాలన అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీగా ఐఎఏఎస్ అధికారులను బదిలీ చేశారు. మొత్తం 20 మంది ఐఏఎస్ అధికారులను ఒకే రోజు బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు భారీగా ఉన్నారు. శ్రీకాకుళం కలెక్టర్‌గా ఉన్న జె.నివాస్‌ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎల్.ఎస్.బాలాజీరావు నియమించారు. అనంతపురం కలెక్టర్‌గా ఉన్న గంధం చంద్రుడికీ స్థానచలనం కలిగించారు. ఆయన స్థానంలో నాగలక్ష్మిని నియమించారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా జె.నివాస్ నియామకమయ్యారు.
మిగిలిన అధికారుల బదిలీ వివరాలు:
శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా హిమాన్షు కౌశిక్
విశాఖ జేసీగా కల్పనా కుమారి
విజయనగరం జాయింట్ కలెక్టర్‌గా మయూర్ అశోక్
తూర్పు గోదావరి జిల్లా జేసీగా జాహ్నవి
పశ్చిమగోదావరి జాయింట్ కలెక్టర్‌గా ధనుంజయ్
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఎస్.ఎన్.అజయ్‌కుమార్
గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా అనుపమా అంజలి
ప్రకాశం జిల్లా జేసీగా విశ్వనాథం
నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా విదేహ్ కేర్
కర్నూలు జాయింట్ కలెక్టర్‌గా ఎన్.మౌర్య
చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వెంకటేశ్వర్
అనంతపురం జిల్లా జేసీగా టి.నిశాంతి
కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ధ్యానచంద్ర
పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా రోనకి గోపాలకృష్ణ
ఏపీ ఆగ్రోస్ ఎండీగా ఎస్.కృష్ణమూర్తి నియామకం
గ్రామ వార్డు సెక్రటరీ డైరెక్టర్‌గా గంధం చంద్రుడును
మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీగా ఇంతియాజ్