కరోనా వ్యాధిని నయం చేసేందుకు సైంటిస్టులు ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల మెడిసిన్లపై ప్రస్తుతం ప్రయోగాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా పలువురు సైంటిస్టులు పెయిన్ కిల్లర్‌గా వాడుతున్న ఐబూప్రొఫేన్ అనబడే మెడిసిన్‌పై ప్రయోగాలు చేస్తున్నారు. ఈ మెడిసిన్ కరోనా చికిత్సకు పనికొస్తుందా, లేదా అన్న అంశాలను వారు పరిశీలిస్తున్నారు. లండన్‌కు చెందిన గైస్ అండ్ సెయింట్ థామస్ హాస్పిటల్, కింగ్స్ కాలేజ్ సైంటిస్టులు ఐబూప్రొఫేన్‌ను కరోనా చికిత్సకు వాడగలమా, లేదా అన్న అంశాలను నిర్దారించుకునేందుకు ఆ మెడిసిన్‌పై ప్రయోగాలు చేస్తున్నారు.
అయితే ఐబూప్రొఫేన్ కరోనా వ్యాధిగ్రస్తుల్లో ఉండే శ్వాసకోశ సమస్యలను చాలా వరకు తగ్గిస్తుందని ఆ సైంటిస్టులు గుర్తించారు. దీంతో వారికి వెంటిలేటర్లను వాడాల్సిన అవసరం లేదని, ఇది కరోనా చికిత్సకు అయ్యే ఖర్చును చాలా వరకు తగ్గిస్తుందని.. వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మెడిసిన్‌ను పేషెంట్లు సొంతంగా వాడకూడదని, వారికి కరోనా లక్షణాలు, అందులో భాగంగా వచ్చే శ్వాస సమస్యలు ఉంటే పారాసిటమాల్‌ను వాడవచ్చని అంటున్నారు. అంతేకానీ ఐబూప్రొఫేన్‌ను వాడకూడదని సూచిస్తున్నారు.
అయితే గతంలో కరోనా పేషెంట్లు ఐబూప్రొఫేన్‌ను వాడితే సమస్య మరింత ఎక్కువవుతుందేమోనని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. కానీ అందులోనూ నిజం లేదని ప్రస్తుతం సైంటిస్టులు తేల్చారు. ఐబూప్రొఫేన్ మెడిసిన్ కరోనా రోగులకు ఉండే శ్వాస సమస్యలను చాలా వరకు తగ్గిస్తుందని, అందువల్ల ఆ చికిత్సకు ఈ మెడిసిన్‌ను వైద్యులు వాడవచ్చని సూచిస్తున్నారు. అయితే దీనిపై తమ ప్రయోగాలు ఇంకా కొనసాగుతాయని వారు చెబుతున్నారు.