దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న వేళ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఉపశమనం కలిగించే వార్త తెలిపింది. కేవలం 2 గంటల సమయంలో కొత్త వేరియంట్‌ను నిర్దారించే టెస్టింగ్ కిట్‌ను రూపొందించినట్లు అసోం దిబ్రుగర్‌లోని ఐసీఎంఆర్ తెలిపింది.
చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయట పడుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో 33 కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. ఒమిక్రాన్ వేరియంట్‌ను వెంటనే గుర్తించడం సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టెస్టింగ్ కిట్ల ద్వారా ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించడానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతున్నది.
ఐసీఎంఆర్ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్(ఆర్ఎంఆర్‌సీ) శాస్త్రవేత్తలు కొవిడ్-19 కొత్త వేరియంట్‌ను సరైన సమయంలో గుర్తించడానికి అవసరమైన టెస్టింగ్ కిట్‌ను అభివృద్ధి చేశారు.
బిశ్వజ్యోతి బొర్గకోటి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం తయారు చేసిన టెస్టింగ్ కిట్ ద్వారా శాంపిల్స్ ఇచ్చిన 2 గంటల సమయంలోనే ఒమిక్రాన్ వేరియంట్‌ను నిర్ధారించవచ్చు.