వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా డెల్టా వేరియంట్ సోకే అవకాశం.. ఐసీఎంఆర్ స్టడీ

-

కరోనా కొత్త వేరియంట్ డెల్టా పై అందరికీ భయాలు ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా డెల్టా వేరియంట్ బారిన పడే అవకాశాలు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఐసీఏంఆర్ అధ్యయనం కూడా ఇదే చెబుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ ప్రకారం, ఐసీఎంఆర్ అనుమతించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.ఈ మేరకు చెన్నై జర్నల్ లో ఆగస్టు 17వ తేదీన ప్రచురితం అయ్యింది. ఈ అధ్యయనం ప్రకారం సెకండ్ వేవ్ కి కారణమైన డెల్టా వేరియంట్, అటు వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళతో పాటు, తీసుకున్న వారికి కూడా సోకే అవకాశం ఉందని, కాకపోతే వైరస్ ప్రభావంలో మార్పు ఉంటుందని వెల్లడించింది.

ఈ అధ్యయనంలో భాగమైన జీరోమ్ తంగిరాజు అనే శాస్త్రవేత్త ప్రకారం, అధ్యయనం చేసిన శాంపిల్స్ చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏది ఏమైనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ డెల్టా వేరియంట్ బారిన పడే అవకాశం ఉన్నదని తెలిపారు. అందువల్ల కరోనా నియమాలను ఖచ్చితంగా పాటించాలని, అజాగ్రత్తగా ఉండకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండడం మంచిదని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news