జమ్మూ కాశ్మీర్ లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు..!

-

జమ్మూ కాశ్మీర్ లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా సంస్థలు వెల్లడించాయి. వారిలో అత్యధికంగా లష్కరే తయ్యిబా ముఠా సభ్యులు ఉన్నారని పేర్కొన్నాయి. భద్రతా దళాలు నిర్వహిస్తున్న రికార్డుల ఆధారంగా ఈ విషయం వెల్లడవుతోంది. వారిలో 18 మంది జైషే మహమ్మద్, 35 మంది లష్కరే ముఠాలకు చెందిన వారు అని వాటిని బట్టి తెలుస్తోంది. ముగ్గురికి హిజ్జుల్ ముజాహిద్దీన్ తో సంబంధం ఉందని.. వారు కూడా పాకిస్తాన్ కి చెందిన వారని భద్రతా సంస్థలకు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు.

17 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారు. విదేశీ ఉగ్రవాదులతో పోల్చుకుంటే ఆ సంఖ్య తక్కువగా ఉంది. విదేశీ ఉగ్రవాదుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. కాశ్మీర్ లో కొంత కాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు భద్రతా దళాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తొయిబా అనుబంధ విభాగం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్టు ప్రకటించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news