హోలీ నాడు దంపతులు ఇలా చేస్తే కలకాలం ఆనందంగా ఉండచ్చు..!

-

చాలామంది హోలీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు పైగా కొన్ని రకాల పద్ధతులని హోలీ నాడు అనుసరిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఫాల్గుణ మాసం లో పౌర్ణమి నాడు హోలీ పండుగ వస్తుంది. ఈసారి హోలీ పండుగ మార్చి 8వ తేదీన వచ్చింది ఈరోజు రాత్రి సమయంలో హోలీక దహనం చేస్తారు మంచిగా సక్సెస్ పొందాలని భావించేవాళ్లు ఈ సమయాన్ని వినియోగించుకుంటారు.

హోలీ నాడు భార్యాభర్తలు కలిసి భగవంతుడిని ప్రార్థించడం వలన సుఖసంతోషాలు ఐశ్వర్యం పెరుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక హోళిక దహనం నాడు ఎటువంటి పద్ధతుల్ని అనుసరించాలి అనే విషయాన్ని చూద్దాం.

ప్రతిరోజు భోజనం తినే ముందు కొంచెం దేవుడికి నైవేద్యంగా పెడితే ఐశ్వర్యం పెరుగుతుంది రోజూ ఇలా చేయకపోతే హోలీ నాడు దీపావళి నాడు చైత్ర నవరాత్రుల నాడు ఇలా చేస్తే మంచిది.
శ్రీమహావిష్ణువు కి భార్య భర్తలు ఇద్దరూ ఆహారాన్ని నైవేద్యం పెట్టి ఆహారాన్ని తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఆనందంగా ఉండగలరు.
హోలికా దహనం నాడు అనగా ఫాల్గుణ పౌర్ణమి నాడు శివలింగాన్ని చూడడానికి భార్యాభర్తలు వెళ్ళకూడదు. ఇలా చేయడం వలన వారి యొక్క వైవాహిక జీవితం పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. కానీ సంతానం ఉన్నవారు శివలింగాన్ని పూజించొచ్చు.
అలానే గర్భిణీలు ఆ నాడు శ్రీమహావిష్ణువుకి పూజ చేయొచ్చు. హోలికా దహనం నాడు భార్య భర్తలు ఇద్దరు కలిసి చంద్రుడుని చూస్తే కూడా ఎంతో మంచిది ఇలా చేస్తే వైవాహిక జీవితంలో చక్కటి ఫలితాలు వస్తాయి.
చంద్రుడు స్థానం కనుక మీ జాతకంలో బలంగా ఉంటే మనోబలం పెరుగుతుంది ఇలా హోలికా దహనం నాడు ఈ విధంగా అనుసరిస్తే చక్కటి ఫలితాలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news