ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేము సిద్ధం – బండి సంజయ్

-

మంగళవారం ఢిల్లీలో బిజెపి అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలతో తెలంగాణ బిజెపి నేతల సమావేశం ముగిసింది. ఈ అత్యవసర భేటీలో తెలంగాణలో బిజెపి భవిష్యత్ కార్యాచరణ  నేతలు చర్చించారు. సమావేశం అనంతరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధమేనని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో బిజెపిని మరింత ముందుకు తీసుకెళ్లడమే తమ ముందున్న లక్ష్యం అని అన్నారు బండి సంజయ్. తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని.. ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయని తెలిపారు. బిఆర్ఎస్ కు ప్రత్యామ్యాయం బిజెపి మాత్రమేనని ప్రజలు భావిస్తున్నారని వెల్లడించారు. తమకు 119 నియోజకవర్గాలలో బలమైన నేతలు ఉన్నారని తెలిపారు బండి సంజయ్. సిసోడియా అరెస్ట్ కు, తెలంగాణ బిజెపి రాజకీయాలకు సంబంధం లేదన్నారు. డిల్లి లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును సిబిఐ నాలుగు సార్లు పేర్కొందని.. కవిత పేరు ప్రస్తావించినప్పుడు సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news