నా పేరిట గడీ ఉందని నిరూపిస్తే.. సీఎం రేవంత్ రెడ్డికి రాసిస్తా.. రఘునందన్ రావు సవాల్..!

-

తన పేరిట గడీ ఉందని నిరూపిస్తే.. సీఎం రేవంత్ రెడ్డికి రాసిస్తా అని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి  రఘునందన్ రావు సవాల్ విసిరారు. తనకు గడీ ఉందని సీఎం రేవంత్ రెడ్డి నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. అది ఆయనకే రాసిస్తానని.. అందుకు రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా పెట్టుకుంటానని రఘునందన్ రావు సవాల్ విసిరారు.

అధికారం మారినా రాష్ట్రంలో ఏ మార్పు జరగడం లేదు. కేసీఆర్ దారిలోనే సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో మాకు ఎలాంటి దోస్తీ లేదన్నారు. తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేసారు. బీజేపీ మత రాజకీయం చేస్తుందని.. పచ్చి అబద్ధం అని మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అమలుకు సాధ్యం కానీ హామిలు ఇవ్వడం.. ఇక ఆ తరువాత మరిచిపోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అని సెటైర్ వేశారు. ఈసారి హామీలు ఇవ్వడం కాంగ్రెస్ వంతు.. అమలు చేయడం మావంతు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రఘునందన్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news