నారాయణ అరెస్ట్ కరెక్ట్ అయితే..జగన్, బొత్సను అరెస్టు చేయాలి: ఎంపీ రఘురామ

-

మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ అరెస్టు వ్యవహారంపై ఘాటుగా స్పందించారు వైసీపీ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. నారాయణ అరెస్టును ఖండిస్తూ ఉన్నట్లు తెలిపారు. పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ విషయంలో 36 మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వం ఇటీవల చెప్పిందన్నారు. దీనికి సంబంధించి నారాయణ అరెస్ట్ న్యాయం అనుకుంటే.. సీఎం జగన్, విద్యా శాఖ మంత్రి బొత్సను అరెస్టు చేయాలి కదా? అని రఘురామ ప్రశ్నించారు.

ఇటీవల తిరుపతిలో సీఎం జగన్ నారాయణ, శ్రీ చైతన్య పాఠశాల నుంచే పదవ తరగతి ప్రశ్నా పత్రాలు లీక్ అయ్యాయని అన్నారని, అన్యాయంగా తమపై అపవాదులు పెడుతున్నారని చెప్పారు అని రఘురామ తెలిపారు. ఆ తర్వాత రోజు అది అంతా అబద్ధం అని బొత్స అన్నారు. ఇందులో ఏది నిజం అని రఘురామ ప్రశ్నించారు. నారాయణను అరెస్టు చేయడం తప్పు అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వారు నారాయణ అరెస్టును ఖండించాలని రఘురామ పిలుపునిచ్చారు. ప్రభుత్వ అన్యాయాలపై ప్రశ్నించడానికి ఇప్పుడిప్పుడే నాయకులు, వారిని చూసి ప్రజలు బయటకు వస్తున్నారని తెలిపారు. ఓ సీనియర్ నేతను అరెస్టు చేస్తే వీళ్లంతా భయపడతారని సర్కారు భావిస్తోందని రఘురామ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news