రైతు భరోసా కేంద్రంలో.. కేవలం రూపాయి కడితే.. ?

-

ఏపీ సీయం జగన్ మోహన్ రెడ్ది తాను అధికారంలోకి రాకముందు రైతులకు ఇచ్చిన ఒక్కోమాటను ఇప్పుడు నిలబెట్టుకుంటూ వస్తున్నారు.. ఈ క్రమంలో తమ ప్రభుత్వం రైతు పక్షాన ఎప్పటికి నిలుస్తుందని నిరూపించేలా ఎన్నో పధకాలను అమలు చేస్తున్నారు.. కాగా ప్రస్తుతం రైతుల విషయంలో మరో ముందడుగు వేశారు. రైతులకు గత ప్రభుత్వం ఎగనామం పెట్టిన పంటల బీమా సొమ్మును చెల్లించేందుకు రూ. 596.36 కోట్లు శుక్రవారం విడుదల చేయగా, ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానుందని తెలిపారు..

ఇక ఈ పధకం ద్వారా మొత్తం 5,94,005 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇదే కాకుండా రైతులు కేవలం రూపాయి కడితే చాలు.. రైతు భరోసా కేంద్రంలోనే ఇ– క్రాపింగ్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.. ఇందులో భాగంగా.. గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్‌ కలిసి ఇ– క్రాపింగ్‌ రిజిస్టర్‌ చేసి.. వెంటనే ఇన్సూరెన్స్‌ను కట్టేలా ఏర్పాటు చేస్తారని, అదీగాక రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం కడుతుందని.. బీమా పరిహారం పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని జగన్ స్పష్టం చేశారు.

 

అంతే కాకుండా గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్లు ఇ–క్రాపింగ్‌ పటిష్టంగా అమలు అయ్యేలా చూడాలని పేర్కొన్నారు.. ఇకపోతే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుల, మత, రాజకీయాలకు అతీతంగా సామాజికవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్న విషయం తెలిసిందే..

Read more RELATED
Recommended to you

Latest news