మాజీ మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటారు. తరచూ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అధికారపక్షం చేసే తప్పులను వేలెత్తి చూపిస్తుంటారు, ఆధికారపక్షమైన వైసీపీ పై విమర్శలు గుప్పిస్తుంటారు. ఈ నేపద్యంలో తాజాగా ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేస్తూ జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. చంద్రబాబు హయాం లో వచ్చిన కంపెనీ అపోలో టైర్స్ తన తొలి టైర్ ను విడుదల చేస్తున్న నేపద్యంలో వారికి అభినందనలు తెలియజేశారు.
ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఒక కంపెనీ తీసుకురావడం అంటే పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేసుకున్నంత ఈజీ కాదని ప్రభుత్వంపై కౌంటర్ వేశారు. రికార్డ్ టైం లో కంపెనీలు ఏర్పాటు కావాలన్నా, నిరుద్యోగ యువత కి ఉద్యోగాలు కల్పించాలన్నా, అది ఒక చంద్రబాబు తోనే సాధ్యమని ఆయన కామెంట్స్ చేశారు. టీడీపీ హయాంలో కంపెనీ ఏర్పాటుకి ముందుకు వచ్చి, తొలిదశలో రూ.3,800కోట్ల పెట్టుబడి పెట్టి, ఈరోజు తొలి టైర్ ని విడుదల చేసిన అపోలో టైర్స్ సంస్థను అభినందిస్తున్నాను అని లోకేశ్ అన్నారు. కంపెనీ మరింత వృద్ధిచెంది ఆంధ్రరాష్ట్ర యువతకి మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అంటూ ట్వీట్ ను పోస్ట్ చేశారు.
టిడిపి హయాంలో కంపెనీ ఏర్పాటుకి ముందుకు వచ్చి,తొలిదశలో రూ.3,800కోట్ల పెట్టుబడి పెట్టి,ఈరోజు తొలి టైర్ ని విడుదల చేసిన @apollotyres వారిని అభినందిస్తున్నాను.కంపెనీ మరింత వృద్ధిచెంది ఆంధ్రరాష్ట్ర యువతకి మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను(2/2)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) June 26, 2020