వ్యాక్సిన్ వేసుకున్నా యాంటీబాడీస్ పెరగడం లేదా.. అశ్వగంధ పొడితో పెంచేయొచ్చు..!

-

వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించుకోవాడనికి ఇప్పటికే అందరూ రెండు డోసులు కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మూడో డోస్ కూడా వేసుకోవాలంటున్నారు. వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో యాంటీబాడీస్ బాగా పెరిగి.. ఆ వైరస్ భారినుండి మన శరీరాన్ని కాపడతాయి. కానీ కొందరిలో వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. ఇవి చాలా తక్కువగా తయారవుతాయి. మరి ఇవి ఎక్కువగా ఉత్పత్తి అయి, ఎక్కువ కాలం బాడీలో ఉంటే ఎలాంటి వైరస్ దరిచేరదు. ఈరోజు మనం ఇవి ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలంటే ఏం చేయాలి.? అసలు తక్కువగా ప్రొడ్యూస్ అవడానికి కారణం ఏంటో చూద్దాం.
యాంటీ బాడీస్ ను ఉత్పత్తి చేసే వాటిని B Lymphocytes అంటారు. ఈ బీ కణాలు.. యాంటిబాడీస్ ను తక్కువగా ఉత్పత్తి చేయడానికి మానసికి ఒత్తిడి కూడా ఒక కారణం. మనకు స్ట్రస్ ఎక్కువైనప్పుడు ఆ సమయంలో గుండె వేగం పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో కార్టసాల్( Cortisol) అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది బీ లింఫోసైట్స్ మీద ప్రభావం చూపుతుంది. దాని వల్ల యాంటిబాడీస్ ఉత్పత్తి తగ్గుతుంది. దీన్ని ఆపడానికి అశ్వగంధ బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు.
అశ్వగంధ వాడేవారికి మెంటల్ స్ట్రస్ తగ్గి.. కార్టిసాల్ ప్రొడెక్షన్ తగ్గి, బీ సెల్స్ ను బాగా యాక్టీవేట్ చేసి.. యాంటిబాడీస్ ప్రొడెక్షన్ పెరిగేట్లు చేస్తుందని.. సైంటిస్టులు కనుగొన్నారు.
వైరస్ బాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు.. ఇవి లోపలికి వెళ్లి కణాలను డామేజ్ చేస్తాయి. ఇలా డామేజ్ ఇన్ఫెక్షన్ అయిన సెల్స్.. పక్కన వాటికి అంటుకుని స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోతాయి. ఇలా స్ప్రెడ్ అ‌వకుండా. డామేజ్ అయిన సెల్స్ ను తొలగించడానికి కూడా అశ్వగంధ పనికొస్తుందట. ఇది శరీరంలోకి వెళ్లి..అందులో ఉండే బయోకాంపోనెండ్స్.. టీ కిల్లర్ సెల్స్ T- Killer cells ను ను యాక్టివేట్ చేస్తుంది. ఇవి సైటో టాక్సిక్ కెమికల్స్ ను ( Cytotoxic T cell) రిలీజ్ చేసి మన శరీరంలో డామేజ్ అయిన సెల్స్ ఏవి అయితే ఉన్నాయో అవి చనిపోయేటట్లు చేస్తుందట. తద్వారా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవకుండా కంట్రోల్ చేయడానికి అశ్వగంధ ఉపయోగపడుతుంది.
ఇక అశ్వగంధ వల్ల మరో లాభం ఏంటంటే.. ఫాగోసైటోసిస్( Phagocytosis) అనే ప్రక్రియ మన శరీరంలో రాత్రి వేళ జరుగుతుంది. అంటే.. శరీరంలో వైరస్ బాక్టీరియాలు ఉంటే.. వాటిని రక్షకదళాలు భక్షించే ప్రక్రియను ఫాగోసైటోసిస్ అంటారు. ఈ ప్రక్రియను అశ్వగంధ స్పీడప్ చేస్తుందట. ఎ‌వరి శరీరంలో అయితే…ఈ ప్రక్రియ బాగా జరుగుతుందో వారు యాక్టీవ్ గా హెల్తీగా ఉంటారు. వాళ్ల శరీరంలో వైరస్ ఉండదు కదా..! ఇమ్యునిటీ బాగా బూస్ట్ అవుతుంది. ఇంకా ఈ ప్రక్రియ బాగా జరగాలంటే.. ఎర్లీ డిన్నర్ చాలా అవసరం.
హెచ్ఐవీ పేషెంట్స్ కి CD-4 కౌంట్ పెరగడానికి అశ్వగంధ బాగా ఉపయోగడపుతుందని కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు. ఏయిడ్స్ కింద కన్వర్ట్ అవకుండా ఈ కౌంట్ పెరుగుతూ.. హెచ్ఐవీలోనే లైప్ స్పాన్ పెరుగుతుంది.
ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ , క్యాన్సర్స్ , డయాబెటీస్, మెటబాలిక్ డిసీసెజ్ లాంటి దీర్ఘరోగాలు రావడానికి కారణమయ్యే.. ఇన్ఫ్లమేటరీ మార్కెర్స్ ( Inflammatory Markers) Tnf-Alfa, Il-6( Interleukin), IL-16( Interleukin 16), Cytokines ఇవి ఈ డీసీస్ వచ్చేలా చేస్తాయి. అశ్వగంధ వీటన్నింటిని కంట్రోల్ చేసి.. దాడితప్పిన రక్షణ వ్యవస్థను రెగ్యులేట్ చేస్తుంది.
ఇమ్యూనిటీకి అశ్వగంధ చాలా మేలు చేస్తుంది. ఈరోజుల్లో ఇది ఎంత అవసరమో అందరికీ తెలుసు. నీళ్లలో అశ్వగంధ పొడి వేసుకుని తాగొచ్చు. కాబట్టి అందరూ ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news