ఈ మధ్యన ఎక్కువ మంది ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ ని ఎక్కువ చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) ని ఎక్కువ వాడతారు. అయితే ఈ ట్రాన్సక్షన్స్ అప్పుడు అర గంట పాటు ఆగాల్సి వుంది. అప్పటి వరకు డబ్బులు పడవు. ఆర్‌టీజీఎస్ అయితే రియల్ టైమ్‌లో ఫండ్స్ బదిలీ అవుతాయి.
ట్రాన్సక్షన్స్ చెయ్యడానికి ఇవి బాగా ఉపయోగ పడతాయి. ఒక్కోసార్లు ఈ విధానములో ట్రాన్సక్షన్స్ చేసినా క్రిడిట్ అవ్వకపోవచ్చు. అప్పుడు ఏం చెయ్యాలి అనేది చూద్దాం. నెఫ్ట్ లావాదేవీలు చేస్తే లబ్దిదారుల ఖాతాను యాడ్ చేసిన అర గంటకు డబ్బులు పంపుకోవచ్చు. ఇవి క్రెడిట్ అవ్వాలంటే రెండు గంటల సమయం పడుతుంది.
ఒకవేళ డబ్బులు క్రెడిట్ అవ్వలేదంటే రెండు గంటల్లోగా ఆ డబ్బులను డెస్టినేషన్ బ్యాంకులు రిటర్న్ చెయ్యాలి. నెఫ్ట్ ద్వారా డబ్బు పంపినప్పుడు రెండు గంటల్లోగా క్రెడిట్ అవ్వకపోయినా డబ్బు రిటర్న్ అవ్వకపోయినా బ్యాంకులు ప్రభావిత కస్టమర్‌కి పెనాల్టీ వడ్డీని చెల్లించాలి.
అలానే RTGS ద్వారా డబ్బులను పంపినప్పుడు రియల్ టైమ్‌లో లబ్దిదారుల బ్రాంచులు పొందడం జరుగుతుంది. బ్యాంకు 30 నిమిషాల్లోగా లబ్దిదారుల ఖాతాలో వెయ్యాలి. లబ్దిదారుల అకౌంట్లోకి ఫండ్స్‌ను క్రెడిట్ చేయలేక పోయినప్పుడు ఆర్‌టీజీఎస్ బిజినెస్ డే ముగిసే నాటికి లేదా పేమెంట్ ఇంటర్‌ఫేస్‌లో వద్ద పేమెంట్ పొందిన గంట లో పంపాలి.