అల్యూమినియం పాత్రల్లో వండింది తింటే మతిమరుపు వస్తుందా..?

-

చాలామంది వంటగదిలో అల్యూమినియం పాత్రలే ఉంటాయి. ఇది అది అని తేడా లేకుండా దాదాపు అన్ని వంటలు అల్యుమినియం వంటపాత్రల్లోనే వండేస్తుంటారు. వంట చేసే పాత్రల ఎంపిక చాలా ముఖ్యం. దీర్ఘకాలికంగా అల్యుమినియం వంటపాత్రల్లో చేసిన వంట తినటం వల్ల మతిమరుపు వ్యాధి వస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
వడోదరలో ఉన్న ఎమ్మెస్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆహారపరిశోధకులు అల్యూమినియం వంటపాత్రల్లో చేసినవి తింటే అల్జీమర్స్‌ వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు. అల్యూమినియం కళాయిల్లో వండే డీప్ ఫ్రై వంటల వల్ల అల్యూమినియం సూక్ష్మమైన కణాల రూపంలో శరీరంలో చేరే అవకావం ఉంది. దీని వల్ల మతిమరుపు వ్యాధితో పాటూ ఆస్టియోపోరోసిస్, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుందట.. అలాగే ఇది మెదడు కుచించుకుపోయేలా చేస్తుంది. మెదడు కణాలు కూడా చనిపోయే పరిస్థితి ఏర్పడుతుందట.
పరిశోధన ఇలా జరిగింది.. 
వడోదరలో నివసిస్తున్న 90 మంది అల్టీమర్స్ రోగులపై ఈ పరిశోధన సాగింది. వీరంతా తేలికపాటి నుంచి తీవ్రమైన అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. అలాగే వీరి వయసు కూడా 60 ఏళ్లు పైనే ఉంది. వీరంతా ఎన్నో ఏళ్లుగా అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారాన్ని తింటున్న వారే.. దాంతో.. మతిమరుపు వ్యాధికి, అల్యూమినియం పాత్రలకు మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కోవాలనుకున్నారు. వారు చెప్పిన ప్రకారం అధిక ఉష్ణోగ్రత వద్ద అల్యూమినియం పాత్రలు కంటికి కనిపంచకుండా కరగడం ప్రారంభమవుతుంది. చాలా చిన్న చిన్న కణాలుగా విడిపోయి ఆహారంలో కలిసిపోతుంది ఈ లోహం. దీని వల్లే అనేక సమస్యలు వస్తాయని, జీర్ణ వ్యవస్థకు కూడా హాని కలిగిస్తుందని, కేవలం అల్యూమినియం పాత్రల్లో వండడమే కాదు, అల్యూమినియం ఫాయిల్ పేపర్లలో బేకింగ్ చేయడం వల్ల కూడా ఆహార సమస్యలు ఎదురవుతాయని వీరు కనుగొన్నారు..
ఏ పాత్రలు మంచిది..?
ఇంత చెప్పాక మీకు ఒక డౌట్‌ రావొచ్చు. మరి ఏది మంచిది అనీ.. ఇనుము లేదా స్టెయిన్ లెస్ స్టీలు పాత్రలు వాడడం మంచిదని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news